Bank of India Apprentice Recruitment 2025–26 Notification Out – Apply Online for 400 Posts

 బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025–26 నోటిఫికేషన్ విడుదల 400 పోస్టులు


బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India – BOI) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్రెంటిస్ నియామకాల నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేసింది. Apprentices Act, 1961 ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, జోన్లలో మొత్తం 400 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.


డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు..



ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 25 డిసెంబర్ 2025

దరఖాస్తుల చివరి తేదీ: 10 జనవరి 2026

అర్హత, వయస్సు లెక్కింపు తేదీ: 01 డిసెంబర్ 2025

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: తరువాత ప్రకటిస్తారు


ఖాళీల వివరాలు:



👉పోస్ట్ పేరు: Apprentice

👉మొత్తం ఖాళీలు: 400

👉శిక్షణ కాలం: 1 సంవత్సరం

👉పని చేసే ప్రాంతం: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు

👉ఖాళీలు రాష్ట్రాల వారీగా, జోన్ వారీగా, కేటగిరీ (SC / ST / OBC / EWS / GEN / PwBD) ప్రకారం ఉన్నాయి.


అర్హతలు (Eligibility Criteria):


👉జాతీయత

👉అభ్యర్థి భారతీయ పౌరుడు అయి ఉండాలి

వయస్సు పరిమితి (01.12.2025 నాటికి)

👉కనీస వయస్సు: 20 సంవత్సరాలు

👉గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు


వయస్సు సడలింపు:


👉SC / ST – 5 సంవత్సరాలు

👉OBC (నాన్ క్రీమీ లేయర్) – 3 సంవత్సరాలు

PwBD – 10 సంవత్సరాలు


విద్యార్హత:


👉గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ

👉డిగ్రీ పూర్తి చేసిన కాలం: 01.04.2021 నుండి 01.12.2025 మధ్య


ఎంపిక విధానం (Selection Process)


1) ఆన్‌లైన్ రాత పరీక్ష


2) స్థానిక భాష పరీక్ష (Local Language Test)


ఆన్‌లైన్ పరీక్ష విధానం:


1.జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25 25

2.ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 25

3.క్వాంటిటేటివ్ & రీజనింగ్ 25 25

4.కంప్యూటర్ నాలెడ్జ్ 25 25

5.మొత్తం 100 100

6.పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు

7.ఇంగ్లీష్ విభాగం క్వాలిఫైయింగ్ మాత్రమే


స్టైపెండ్ (వేతనం):


ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹13,000 స్టైపెండ్ అందజేస్తారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా: ₹8,500

కేంద్ర ప్రభుత్వ DBT వాటా: ₹4,500


దరఖాస్తు ఫీజు:


వర్గం - ఫీజు


PwBD ₹400 + GST

SC / ST / అన్ని మహిళలు:₹600 + GST

ఇతరులు ₹800 + GST


దరఖాస్తు విధానం (How to Apply)


1. NATS పోర్టల్ కు వెళ్లండి: https://nats.education.gov.in


2. Student గా రిజిస్టర్ అయి Enrollment ID పొందాలి


3. “Apprenticeship with Bank of India” ఎంపిక చేసి అప్లై చేయాలి


4. BFSI SSC నుంచి వచ్చే మెయిల్ ద్వారా ఫీజు చెల్లించాలి


5. చివరి తేదీకి ముందే ఫారం సబ్మిట్ చేయాలి


ముఖ్యమైన సూచనలు:


ఒక అభ్యర్థి ఒక రాష్ట్రం & ఒక జోన్ కి మాత్రమే దరఖాస్తు చేయాలి

అప్రెంటిస్ శిక్షణ పూర్తయిన తర్వాత శాశ్వత ఉద్యోగ హామీ లేదు

తాజా అప్డేట్స్ కోసం www.bankofindia.bank.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలి


చివరి మాట:


డిగ్రీ పూర్తిచేసిన యువతకు బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందడానికి ఇది చాలా మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా 10 జనవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోండి.


👉 Official Notification PDF


👉 Official Website








Post a Comment

0 Comments